ఎరువుల యాజమాన్యం:
ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు వాడాలి. లేదా పచ్చిరొట్ట పైరును పెంచి భూమిలో కలియదున్నాలి.
వర్షాధారపు పైరుకు 60 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 50 కిలోల పొటాష్ ఇచ్చే ఎరువులను ఒక హెక్టారుకు వాడాలి.
ఆరుతడి పైరుకు 300 కిలోల నత్రజని, 60 కిలోల భాస్వరం, 120 కిలోల పొటాష్ నిచ్చు ఎరువులను వేయాలి.